ఇదే నిజం నర్సంపేట: మండల పరిధిలోని లోని జయముఖి ఫార్మసీ కళాశాలలో ఫార్మా పరిచయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వాసుదేవ మూర్తి, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ అధికారి శంకర్ రెడ్డి మరియు కళాశాల ఇన్చార్చ్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వాసుదేవమూర్తి మాట్లాడుతూ.. జీవితంలో క్రమశిక్షణ, సమయ పాలన యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకి హిత బోధ చేశారు. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ అధికారి శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఫార్మా రంగంలోని అవకాశాలని విద్యార్థులు అంది పుచ్చుకోవాలని కోరారు. కళాశాల ఇంచార్జి అధికారి చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతికత కి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి అని విద్యార్థులకి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్దులు పాల్గొన్నారు.