Homeహైదరాబాద్latest Newsమనం తినే ఉప్పు, చక్కెరలోనూ ప్లాస్టిక్.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..!

మనం తినే ఉప్పు, చక్కెరలోనూ ప్లాస్టిక్.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..!

ప్రస్తుత కాలంలో ఏ సామాను మోసుకొని రావాలన్న చేతిలో ప్లాస్టిక్ కవర్ ఉండాల్సిందే. అలా మన జీవితంలో నిత్యవసర వస్తువుగా మారింది ఈ ప్లాస్టిక్ భూతం. ఇంకో సంచలన విషయం ఏంటంటే.. భారతదేశంలో దొరికే ఉప్పు, చక్కెర.. ప్యాక్ చేసి అమ్మినా.. లూజుగా అమ్మినా.. అందులో ప్లాస్టిక్ ముక్కలు కనిపిస్తున్నాయని టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణహిత సంస్థ రిసెర్చ్ చేసి చెప్పింది. అన్ని బ్రాండ్ల ఉప్పు ప్యాకెట్లు, చక్కెర ప్యాకెట్లలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని వెల్లడించింది.

ఉప్పు, చక్కెరను వదలని ప్లాస్టిక్.. షాకిచ్చేలా రిపోర్టు
ట్యాక్సిక్స్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో రిసెర్చ్ చేసింది. దీనికోసం సాధారణ ఉప్పు, రాళ్లు ఉప్పు, సముద్ర ఉప్పు, సహజ ఉప్పుతో పాటు ఐదు రకాల చక్కెరలను పరిశీలించగా.. అన్ని శాంపిళ్లలో 0.1 ఎంఎం నుంచి 5 ఎంఎం పరిమాణం కలిగిన ఫైబర్, ఫిల్మ్ ముక్కలు బయటపడ్డాయట. అత్యధికంగా ఒక కిలో అయోడైజ్డ్ ఉప్పులో 89 మైక్రో ప్లాస్టిక్ ముక్కలు.. ఆర్గానిక్ ఉప్పులో 6-7 మైక్రోప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్లు వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img