Homeహైదరాబాద్latest Newsప్రజాపాలనలో చిత్రవిచిత్రాలు.. మొన్న శివుడు.. ఇప్పుడిలా..

ప్రజాపాలనలో చిత్రవిచిత్రాలు.. మొన్న శివుడు.. ఇప్పుడిలా..

తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీల కోసం అభయహస్తం కింద దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దరఖాస్తుకు సంబంధించి విచిత్ర సంఘటనలు ఎదురువుతున్నాయి. ఇటీవల హన్మకొండ జిల్లాలో అభయ హస్తానికి ‘శివయ్య (దేవుడు)’ పేరుతో దరఖాస్తు చేసుకున్న ఘటన మరువక ముందే.. తాజాగా మరో దరఖాస్తు ఫామ్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.

అప్లికేషన్ ఫామ్‌లో తమ వ్యక్తిగత వివరాలు నింపేటప్పుడు కొందరూ విచిత్రంగా రాసుకొచ్చారు. వృత్తి అనే ఖాళీ దగ్గర ‘ఇంటికాడనే ఉంటది’ అని, గృహ వినియోగ విద్యుత్ మీటర్‌ కనెక్షన్ సంఖ్య అనే దగ్గర ‘దొరుకుత లేదు’ అని విచిత్ర సమాధానాలతో ఫామ్ ఫిలప్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Recent

- Advertisment -spot_img