Homeహైదరాబాద్latest Newsఎరువుల దుకాణాలలో పోలీసుల తనిఖీలు

ఎరువుల దుకాణాలలో పోలీసుల తనిఖీలు

ఇదేనిజం, రాయికల్ : రాయికల్ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలలో జగిత్యాల డీఎస్పి రఘు చందర్, మండల వ్యవసాయ అధికారి ముక్తేశ్వర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల దుకాణాలలోని రికార్డులను పరిశీలించి, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారా? అనే కోణంలో నిల్వ ఉన్న ఎరువులను తనిఖీ చేశారు. అనంతరం సంబంధిత దుకాణాల లైసెన్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎరువుల దుకాణాలలో నకిలీ విత్తనాలను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీలలో జగిత్యాల రూరల్ సీఐ అరిఫ్ అలీ ఖాన్, రాయికల్ ఎస్సై అజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img