Homeహైదరాబాద్latest News2000 కిలోల గంజాయిని తగలబెట్టిన పోలీసులు

2000 కిలోల గంజాయిని తగలబెట్టిన పోలీసులు

డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ అవతరించాలన్న సీఎం రేవంత్ ఆకాంక్షలకు పోలీసులు, అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతూ..అక్రమార్కులను కటకటాల్లోకి నెడుతున్నారు. గత కొద్ది రోజులుగా పెద్దమొత్తంలో డ్రగ్స్. గంజాయి పట్టుబడుతోంది. వాటిని స్వాధీనం చేసుకుని, కోర్టు ఆదేశాల మేరకు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో ఇటీవల కాలంలో దొరిగిన 2000 కిలోల గంజాయిని ఎస్పీ చందనా దీప్తి ఆధ్వర్యంలో తగులబెట్టారు.

కోర్టు ఉత్తర్వుల ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో రూ.5.10 కోట్ల విలువ చేసే మొత్తం 2,043 కిలోల గంజాయిని కాల్చి బూడిద చేశారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నెపర్తి పోలీస్ ఫైరింగ్ రేంజ్‌ వద్ద గంజాయిని కాల్చేశారు. 39 కేసుల్లో సీజ్ చేసిన మెుత్తం 2043 కిలోల గంజాయిని నేడు తగులబెట్టినట్లు ఎస్పీ చందనా దీప్తి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంటుందని, మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img