Homeహైదరాబాద్latest Newsపోలింగ్‌ రోజు.. హైదరాబాద్‌లో తగ్గిన పొల్యూషన్‌..

పోలింగ్‌ రోజు.. హైదరాబాద్‌లో తగ్గిన పొల్యూషన్‌..

హైదరాబాద్‌లో పోలింగ్ రోజు వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రజలు ఎన్నికలకు రెండు రోజుల ముందే తమ తమ ప్రాంతాలకు వెళ్లడంతో నగరంలో రద్దీ బాగా తగ్గింది. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే పోలింగ్ రోజు వాయు కాలుష్యం తగ్గినట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. తాజా నివేదిక ప్రకారం.. ఈ నెల 11న గాలిలో పార్టిక్యులేట్‌ మేటర్‌ (పీఎం)-2.5 సూక్ష్మకణాలు క్యూబిక్‌ మీటర్‌కు 45 మైక్రోగ్రాములు ఉండగా, పోలింగ్‌కు ముందు రోజు 22, పోలింగ్‌ రోజున 21, 14న 48 మైక్రోగ్రాములు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. అలాగే, పార్టిక్యులేట్‌ మేటర్‌ (పీఎం)- 10 సూక్ష్మకణాలు మే 11న క్యూబిక్‌ మీటర్‌కు 130 మైక్రోగ్రాములు ఉండగా, మే 12న 44, మే 13న 41, మే 14న 80 మైక్రోగ్రాములు ఉన్నట్లు నివేదికలో తెలిపారు.

Recent

- Advertisment -spot_img