Homeవిచిత్రంInnovation Challenge : దానిమ్మ వ్యర్థాలను ఏం చేయాలో చెప్తే.. రూ. 7...

Innovation Challenge : దానిమ్మ వ్యర్థాలను ఏం చేయాలో చెప్తే.. రూ. 7 కోట్లు మీ సొంతమవుతయ్​

పండ్ల రసాల్లో పొషకాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ రసాలు తీసాక వాటి తొక్కలను పడేస్తం కదా..

అయితే వాటి తొక్కలతో ఏమైనా ఉపయోగాలు ఉంటే వాటిని పడేయకుండా దాచిపెట్టుకోవడమో లేదా వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ఆలోచన చేస్తాం కదా..

ఇలా తొక్కలను సద్వినియోగం చేసే ఆలోచన చెప్తే ఏకంగా రూ.7.3 కోట్ల ప్రైజ్​మనీని సొంతం చేసుకోవచ్చు.

కాలిఫోర్నియాలోని లాస్ఏంజెల్స్ వేదికగా పనిచేస్తున్న ఈ కంపెనీ.. ‘వండర్ ఫుల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’ పేరిట సవాల్ విసరింది.

దానిమ్మ వ్యర్థాలకు ఏదైనా అవసరాలకు వినియోగించేలా తయారుచేసిన వారికి 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 7.3 కోట్లు) బహుమతి ఇస్తామని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు స్టీవ్ స్వార్ట్జ్ ప్రకటించారు.

ఇందుకోసం ఈ డిసెంబర్ 7 వ తేది వరకు ఇందుకు తుది గడువు విధించింది.

ఈ కంపెనీ ఏటా సుమారు 50 వేల టన్నలు దానిమ్మ పండ్లను వినియోగిస్తున్నది. ఫ్యాక్టరీలో ఉండే మిషనరీలు..

పండ్ల తోలు, గింజలనుంచి జ్యూస్ తయారుచేసి మిగిలిన వ్యర్థాలను బయటకు పారేయడం ఈ కంపెనీకి పెద్ద సవాల్​గా మారింది. దీంతో కంపెనీ మేనేజ్​మెంట్​ ప్రజల నుంచి ఐడియాలను ఆహ్వానిస్తోంది.

స్వచ్ఛంద సంస్థ ‘రీఫెడ్’ తో కలిసి వండర్ ఫుల్ కంపెనీ ఈ ఛాలెంజ్ ను ప్రారంభించింది. వ్యక్తిగతంగా లేదా టీంగా ఏర్పడి పరిష్కారం కనుగొన్న వారికి ఈ ప్రైజ్ ఇస్తామని తెలిపింది.

ఈ పరిష్కారం కనుగునే వారికి కావాల్సిన వనరులను తామే సమకూరుస్తామని వండర్ ఫుల్ కంపెనీ పేర్కొన్నది.

అయితే ఇది పర్యావరణ హితంగా ఉండాలని సూచించింది. ఇంకెందుకు ఆలస్యం మరి.. కొత్త ఆవిష్కరణల కోసం మీ బుర్రలకు పదును పెట్టండి. మంచి తరుణం మించినా దొరకదు.

Recent

- Advertisment -spot_img