మాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఆరోపణలు వస్తున్న సమయంలో డ్రగ్స్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల గ్యాంగ్స్టర్ ఓం ప్రకాశ్ నిర్వహించిన డీజే పార్టీలో పలువురు నటీనటులు డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. ‘పిశాచి’ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన నటి ప్రయాగ మార్టిన్, మంజుమ్మల్ బాయ్స్ నటుడు శ్రీనాథ్ భాసి పార్టీలో ఉన్నట్లు సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.