Homeహైదరాబాద్latest Newsమెగాస్టార్ 'విశ్వంభర'లో ప్రముఖ సీనియర్ నటి..?

మెగాస్టార్ ‘విశ్వంభర’లో ప్రముఖ సీనియర్ నటి..?

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’లో ప్రముఖ సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించబోతుందట.. వెండితెరపై విజయశాంతి తిరుగులేని కథానాయికగా కొనసాగారు. లేడీ అమితాబ్ గా యాక్షన్ సినిమాలలోను రాణించారు. రాజకీయాలలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆమె నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. చాలా గ్యాప్ తరువాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో విజయశాంతి మళ్ళీ కనిపించపోతుంది అని వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్ దశలో ఉంది. త్రిష ఒక హీరోయిన్ గా చేస్తుంది. ఆల్రెడీ చిరు త్రిషల మధ్య కొన్ని సీన్స్ ని కూడా తెరకెక్కించారు. ఇక ఇందులో ఒక సీనియర్ హీరోయిన్ కి చోటు ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆ క్యారక్టర్ ని విజయశాంతి చేత చేయించాలని చిత్ర యూనిట్ బావిస్తుందంట. కథ ప్రకారం ఆమె క్యారక్టర్ సెకండ్ హాఫ్ లో వస్తుందంట. అది ఎంటైర్ సినిమాకే చాలా కీలకం అని తెలుస్తుంది. విజయ శాంతి లాంటి సీనియర్ నటీమణి అయితేనే న్యాయం చేయగలదని భావిస్తున్నారు. చిరు దగ్గరనుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావడంతో ఆమెని ఒప్పించే ప్రయత్నాలు జారుతున్నాయట.

Recent

- Advertisment -spot_img