Homeహైదరాబాద్latest Newsఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులకు పోస్టాఫీస్ గుడ్ న్యూస్..!

ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులకు పోస్టాఫీస్ గుడ్ న్యూస్..!

ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు పోస్టాఫీస్ శుభవార్త చెప్పింది. వీరి కోసం పోస్టు ఆఫీసులో మరో కొత్త పథకం అందుబాటులోకి తెచ్చారు. ఇక ఆ పథకం పేరే బాల్‌ జీవన్‌ భీమా యోజన. ఈ పథకంలో కేవలం రోజుకు రూ. 6 పొదుపు చేస్తే చాలు.. మెచ్యూరిటీ సమయంలో కనీస హామీ మొత్తంలో లక్ష రూపాయల రాబడి పొందుతారు. ఒక వేళ మీరు రూ.18 పొదుపు చేస్తే.. 3 లక్షల రూపాయలు పొందవచ్చు. ఇలా పొదుపు చేసే వారి స్థోమతను బట్టి రోజుకు రూ..6 లేదా రూ.18 వరకు ఉంటుంది. అయితే పొదుపు అనేది పిల్లల పేర్ల మీద మాత్రమే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిల్లల వయసు కనీసం 5 నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. అలాగే తల్లిదండ్రులు వయసు కూడా ఈ స్కీమ్‌ పెట్టుబడికి పరిగణలోకి తీసుకుంటారు.

అయితే ఈ స్కీమ్‌ లో తల్లిదండ్రులకు కనీస వయసు 45 ఏళ్లకు మించి ఉండకూడదు. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు ఈ స్కీమ్‌ వర్తించదు. కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. కాగా, ఇద్దరు పిల్లల మీద రోజుకు రూ.36 పొదుపు చేస్తే మెచ్చూరిటీ సమయానికి ఇద్దరిది కలిపి మొత్తం రూ. 6 లక్షల వరకు పొందే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం మీరు సమీపంలోని పోస్టాఫీస్ కు వెళ్లి.. సంబంధిత అధికారులను సంప్రదించి ​ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img