Homeహైదరాబాద్latest News4 రోజుల పాటు అందోలులో విద్యుత్‌ కోతలు

4 రోజుల పాటు అందోలులో విద్యుత్‌ కోతలు

ఇదేనిజం, జోగిపేట: అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని అందోలులో నాలుగు రోజుల పాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం జరుగుతుందని, వినియోగదారులు సహకరించాలని జోగిపేట ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. అందోలులోని శ్రీ రంగనాథ స్వామి రథోత్సవం కోసం, విద్యుత్‌ తీగలకు తగల కుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 16వ తేది నుంచి 20వ తేది వరకు (నాలుగు రోజులు) ఉదయం 6.30 గంటల నుంచి 11 గంటల వరకు 11 కేవీ , ఎల్‌టీ లైన్స్‌లను పెంచేందుకుగాను విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అందోలులో మాత్రమే ఐదున్నర గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామన్నారు.

Recent

- Advertisment -spot_img