Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన సినిమా ”సలార్”. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా, పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా 2023లో డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్ గా ”సలార్ – 2” ఉంటుంది చిత్రబృందం ప్రకటించింది. కానీ తాజాగా ”సలార్ 2” సినిమా ఆగిపోయిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
ప్రభాస్ ఆరోగ్యా పరిస్థితి బాగోలేదు అని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ఇటలీలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్న సినిమాలు మాత్రమే చేసి ఆ తరువాత ఇక సినిమాలకు కొన్ని ఏళ్ళు గ్యాప్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాడు అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి కారణంగా ”సలార్ – 2” సినిమా చేయకూడదు అని ప్రభాస్ నిర్ణయం తీస్కున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా లేట్ చేయకుండా ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెటేసాడు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని అందరూ భావిస్తున్నారు.