పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాలికి గాయమైంది. ఒక సినిమా షూటింగ్‌లో ఆయనకు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ‘కల్కి 2898 AD’ మూవీ ప్రస్తుతం జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా జపాన్‌లో 2025 జనవరి 3న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరో ప్రభాస్ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జపాన్ అభిమానుల కోసం ప్రభాస్ ఓ వీడియో విడుదల చేశారు. ‘షూటింగ్లో నా కాలు బెణికింది అందుకే జపాన్ ప్రమోషన్స్ కు రాలేకపోయా.. అభిమానులు నన్ను క్షమించాలి.. మిమల్ని త్వరలోనే కలుస్తా అని ప్రభాస్ తెలిపారు.