Homeజాతీయంకోమాలో... ప్రణబ్​

కోమాలో… ప్రణబ్​

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. గత 48 గంటలుగా ఆయన ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరంగా ఉండగా ప్రస్తుతం ప్రణబ్​ కోమాలోకి వెళ్ళినట్లు సమాచారం. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో బ్రెయిన్ సర్జరీ కోసం ప్రణబ్​ను ఆసుపత్రిలో చేర్చారు. దీంతో పాటు ఆస్పత్రి వర్గాలు ఆయనకు కరోనా పరీక్షలు జరుపగా కరోనా పాజిటివ్​ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆర్మీ ఆసుపత్రి అయిన ఆర్అండ్ఆర్ ఆసుపత్రిలో ప్రస్తుతం ప్రణబ్​ చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రణబ్​ కోమాలోకి వెళ్ళడంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయన శరీరంలోని ఇతర ముఖ్య అవయవాలు అన్నీ సక్రమంగానే పనిచేస్తున్నందున అంతగా ప్రమాదం లేదని వైద్యులు దైర్యం చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img