భారత సంతతికి చెందిన అమెరికన్ ప్రాంజలి అవస్థి అనే బాలిక మిరాకల్ చేసింది. పదహారేళ్లకే రూ.100 కోట్ల టర్నోవర్‌తో స్టార్టప్‌ను నడుపుతూ ఓరా అనిపిస్తోంది. డెల్వ్.ఏఐ (Delv.AI)పేరుతో ఇప్పటికే పదిమందికి జాబ్ ఇచ్చింది. పరిశోధన కోసం డేటా వెలికితీతకు సంబంధించిన సేవలను ఈ సంస్థ అందిస్తుంటుంది. తన తండ్రి ప్రోత్సాహంతోనే పాఠశాల స్థాయి నుంచే కోడింగ్‌పై మెలకువలు నేర్చుకుంది. 11 ఏళ్ల వయసులో కుటుంబంతో సహా ఇండియా నుంచి అమెరికాలోని ఫ్లోరిడాకు మారిన ప్రాంజలి 13 ఏళ్ల వయసులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ ల్యాబ్స్‌లో ఇంటర్న్‌షిప్ చేసింది. వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించింది. కరోనా సమయంలో వర్చువల్ లర్నింగ్ ద్వారా ఆమె మెషీన్ లర్నింగ్ ప్రాజెక్టుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓపెన్ chatGPT 3 బీటా విడుదలైన క్రమంలోనే ఈ వెంచర్ కూడా మొదలైంది. జనవరి 2022లో దాదాపు రూ. 3.7 కోట్లతో ఈ కంపెనీని స్థాపించింది. సంవత్సరం తిరిగేసరికి రూ.100 కోట్లకు చేరుకుంది.