HomeSocial Mediaఅబ్బాబ్బాబ్బా.. ఏం వాడకం ఇది.. TSRTC బస్సులో ప్రీ–వెడ్డింగ్ షూట్: VIDEO వైరల్

అబ్బాబ్బాబ్బా.. ఏం వాడకం ఇది.. TSRTC బస్సులో ప్రీ–వెడ్డింగ్ షూట్: VIDEO వైరల్

మ్యారేజీ ఫిక్స్ అయిందంటే చాలు.. ప్రీవెడ్డింగ్ షూట్ కోసం ఎగబడుతున్నారు. ఇలా ముహూర్తం పెట్టుకోవడమే ఆలస్యం… అలా ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం జంటలు రెడీ అవుతున్నాయి. తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లి షూట్ చేయించుకొని… పెళ్లిలో ఈ ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియోను ప్రదర్శిస్తున్నారు.

జంటలు తమకు ఇష్టమున్న ప్రాంతాలను ఎంచుకుంటే… ఫోటో గ్రాఫర్ తన క్రియేటివిటికి పదును పెట్టి వీడియోను సిద్ధం చేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఓ జంట ఏకంగా RTC బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్ జరుపుకుంది.

ట్రాఫిక్‌లో ఓ బస్సు ఆగి ఉన్న సమయంలో ఓ జంట ప్రీ-వెడ్డింగ్ షూట్ జరుపుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. యువతి బస్సులో నుంచి దిగుతున్నట్లుగా.. అబ్బాయి వెనుక నుంచి వస్తున్నట్లుగా వీడియో ఉంది. ఆ తర్వాత రోడ్లపై కూడా షూట్ చేశారు.

ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్ఆర్టీసీని ట్యాగ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్‌లో నడిరోడ్డుపై నిలిచిన బస్సు వద్ద షూటింగ్ చేయడాన్ని చాలామంది ఖండిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img