HomeHealthఈ సమ్మర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ సమ్మర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మొన్నటిదాకా చల్లగా ఉన్న వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వచ్చే మే నెలలో ఎండలు ఇంకా ఎక్కువయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎండవేడి నుంచి మనల్ని కాపాడుకోవాల్సిన తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం..

దాహం వేయకపోయినా డీహైడ్రేషన్ కాకుండా అధికంగా నీళ్లు తాగాలి. ప్రయాణాల్లో కచ్చితంగా తాగునీటిని క్యారీ చేయాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. సన్నటి, వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఎండవేళల్లో బయటికి వెళ్లాలి. వెళ్లేటపుడు గొడుగు, టోపీ వంటివి ఉపయోగించాలి. పగటి వేళల్లో కాకుండా ఉదయం, సాయంత్రం మాత్రమే బయటికి వెళ్లాలి. ఈ సమ్మర్‌లో ఆల్కహాల్, టీ, కాఫీ తాగకపోతే బెటర్. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

Recent

- Advertisment -spot_img