HomeజాతీయంInvestments in Space Research : అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులు

Investments in Space Research : అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులు

Investments in Space Research : అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులు

Investments in Space Research : అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులు, ఆవిష్కరణల ప్రోత్సాహానికి ‘ఇండియన్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్’‌: డా.జితేంద్ర సింగ్‌

అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ‘ఇండియన్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్’ ‍(ఇన్‌-స్పేస్‌)ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని ‘అణు శక్తి, అంతరిక్ష శాఖ’ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా.జితేంద్ర సింగ్‌ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం రూపంలో వెల్లడించారు.

శరీరంలో కరోనాను అడ్డుకునే జన్యువులు.. గుర్తించిన శాస్త్రవేత్తలు

వాట్సాప్‌లో ఈ జాగ్ర‌త్త‌లు తెలియ‌కుంటే ఇక అంతే..

ఈ క్రింది అంశాల్లో ప్రైవేటు రంగానికి సౌకర్యాలు, మద్దతును ‘ఇన్‌-స్పేస్’ అందిస్తుంది:

i. సాంకేతిక మద్దతు
ii. నగదు ఆధారిత సౌకర్యాలు
iii. డాస్‌ ఆవరణలో తాత్కాలిక సౌకర్యాల కల్పన
iv. ఎన్‌ఎస్‌ఐఎల్‌ అందించే అవసరాల కోసం బిడ్
v. విజ్ఞానం, అంతరిక్ష అన్వేషణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం
    ప్రైవేటు భాగస్వామ్యం పెంపును సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థాగత, నియంత్రణ వ్యవస్థ ‘ఇన్‌-స్పేస్’‌. దీని పరిధిలో ఆర్థిక పరిమితులు లేవు.

గూగుల్ డేటాను ఇలా బ్యాకప్ చేసుకోండి..

ఐదు నిమిషాల్లో రూ.8 లక్షలు కొట్టేశాడు

ప్రైవేటు వ్యక్తులు భాగస్వామ్యమయ్యే అంశాలు:

i. ఉపగ్రహాల నిర్మాణం
ii. లాంచ్‌ వెహికల్స్‌ నిర్మాణం
iii. ప్రయోగాలు చేపట్టడం
iv. అప్లికేషన్ల వృద్ధి, అంతరిక్ష ఆధారిత సేవలు 
v. అంతరిక్ష రంగ కార్యకలాపాల కోసం ఉప వ్యవస్థలు, వ్యవస్థల వృద్ధి

Recent

- Advertisment -spot_img