HomeసినిమాPriyanka Chopra : ప్రపంచ వేదికపై భారత ఖ్యాతిని చాటిన తొలి నటి

Priyanka Chopra : ప్రపంచ వేదికపై భారత ఖ్యాతిని చాటిన తొలి నటి

Priyanka Chopra : ప్రపంచ వేదికపై భారత ఖ్యాతిని చాటిన తొలి నటి

Priyanka Chopra : దేశం గర్వించదగ్గ తారల్లో ప్రియాంక చోప్రా ఒకరు. బాలీవుడ్​ నుంచి.. హాలీవుడ్​కు వెళ్లి.. ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిభను చాటుతున్నారు.

హాలీవుడ్​లో సినిమాలు చేస్తున్న ఆమె దేశానికి ఏం చేసిందని విమర్శించే వాళ్లూ ఉన్నారు.

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. తన గ్లామర్​ కెరీర్​లో భారతదేశం గర్వపడేలా చేసిన క్షణాలు కూడా ఉన్నాయి.

సోమవారం (జులై 18) ప్రియాంక చోప్రా పుట్టిన రోజు సందర్భంగా.. ఆమె సాధించిన అరుదైన ఘనతలు మీ కోసం..

దేశం గర్వించదగ్గ తారల్లో ప్రియాంక చోప్రా ఒకరు.

బాలీవుడ్​ నుంచి.. హాలీవుడ్​కు వెళ్లి.. ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిభను చాటుతున్నారు.

హాలీవుడ్​లో సినిమాలు చేస్తున్న ఆమె దేశానికి ఏం చేసిందని విమర్శించే వాళ్లూ ఉన్నారు.

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. తన గ్లామర్​ కెరీర్​లో భారతదేశం గర్వపడేలా చేసిన క్షణాలు కూడా ఉన్నాయి.

సోమవారం (జులై 18) ప్రియాంక చోప్రా పుట్టిన రోజు సందర్భంగా.. ఆమె సాధించిన అరుదైన ఘనతలు మీ కోసం..

‘ఫోర్బ్స్’ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రియాంక చోప్రా 2018లో చోటు సంపాదించింది.

ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళ ప్రియాంక కావడం గమనార్హం.

ఈ జాబితాలో ప్రియాంక రెండుసార్లు చోటు దక్కించుకుంది.

అమెరికాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్​ మ్యాగజైన్​ ‘వోగ్’​ కవర్​ పేజీపై చోటు సంపాదించిన మొదటి దక్షిణాసియా వ్యక్తి ప్రియాంక చోప్రా.

2018లో ‘వోగ్’ కవర్‌ పేజీపై ప్రియాంక ఫొటో ముద్రించారు.

మరాకెచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌.. సన్మానం పొందిన మొదటి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.5/ 26

బాలల హక్కుల కోసం గ్లోబల్ యునిసెఫ్ గుడ్​విల్​ అంబాసిడర్​గా ఎంపికైంది.

2016లో గ్లోబల్ యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రియాంకను ప్రకటించారు.

గ్లోబల్ అంబాసిడర్ కాక ముందు.. ఆమె 10 సంవత్సరాల పాటు యునిసెఫ్ సంస్థకు జాతీయ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇది ఒక్క ప్రియాంక చోప్రాకే సాధ్యమైంది.

టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్( టీఐఎఫ్​ఎఫ్​) అంబాసిడర్‌గా ఎంపికైన మొట్టమొదటి భారతీయ నటి ప్రియాంక చోప్రా.

ప్రముఖ జువెలరీ బ్రాండ్​ బుల్గారీ సంస్థకు గ్లోబల్ అంబాసిడర్​గా వ్యవహరించిన మొదటి భారతీయ నటి ప్రియాంక చోప్రా.

టెలివిజన్‌లో ఉత్తమ నటిగా ‘పీపుల్స్ ఛాయిస్’ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ నటి ప్రియాంక చోప్రా.

ప్రపంచ సుందరిగా ఎంపికై.. గ్లోబల్ వేదికపై భారత్​ పేరును దిగంతాలకు చాటారు ప్రియాంక.

2000లో ప్రపంచ సుందరి కిరీటాన్ని ప్రియాంక చోప్రా సాధించింది. అప్పుడు ఆమె వయసు 18 మాత్రమే.

నటుడు, గాయకుడు నిక్‌ జోనస్‌ను 2018లో వివాహం చేసుకున్నారు ప్రియాంక చోప్రా.

హాలీవుడ్‌లో కథానాయికగా రాణిస్తూనే.. విరామం లేకుండా ఉండటం వల్ల హిందీ చిత్రాల్లో తక్కువగా కనిపిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img