Homeఫ్లాష్ ఫ్లాష్న్యూయార్క్‌లో ప్రియాంక చోప్రా రెస్టారెంట్ క్లోజ్? అసలు ఏం జరిగిందంటే..?

న్యూయార్క్‌లో ప్రియాంక చోప్రా రెస్టారెంట్ క్లోజ్? అసలు ఏం జరిగిందంటే..?

హీరోయిన్ ప్రియాంక‌‌ చోప్రా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఓ వైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు చేస్తోంది. అంతేకాకుండా న్యూయార్క్‌లో సోనా పేరిట ఓ రెస్టారెంట్‌ను ఓపెన్ చేసింది. ప్రియాంక చోప్రా రెస్టారెంట్ బాగానే ఫేమస్ అయ్యింది. అయితే త్వరలో సోనా రెస్టారెంట్ మూతపడబోతుంది.
పార్టనర్‌షిప్‌తో మొదలైన ఈ బిజినెస్ ప్రియాంకచోప్రా- నిక్ జోనాస్ దంపతులు గ్రాండ్ స్టార్ట్ చేసింది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు అక్కడికి ఆహారం కోసం వచ్చేవారు. బాలీవుడ్ స్టార్స్ అనుపమ్ ఖేర్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ షూటింగ్ కి వెళ్లేవారు. ఈ బ్యూటీకి రెస్టారెంట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుగా మారింది.
అయితే ప్రియాంక చోప్రా మరియు ఆమె భాగస్వామి మనీషా గోయల్ సంయుక్తంగా ఈ రెస్టారెంట్‌ను మూడేళ్ల ఒప్పందంతో ప్రారంభించారు. ఈ జూన్ 30తో అగ్రిమెంట్ ముగియనుంది. ఈ వారం కాకుండా వచ్చేవారంతో సోనా రెస్టారెంట్ మూతపడబోతోంది.దీనికి సంబంధించి రెస్టారెంట్ నిర్వాహకులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ నెల 30వ తేదీ ఆదివారంతో చివరి సర్వీసు ముగుస్తుందని వెల్లడించారు. వ్యాపారం బాగా సాగుతున్నప్పుడు ఎందుకు మూసేస్తున్నారనే వార్త కూడా వస్తున్నాయి. అయితే రెస్టారెంట్ తెరిచిన రెండు సంవత్సరాల తర్వాత.. ఆమె తన భాగస్వామి మనీష్‌తో విభేదాలు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో అగ్రిమెంట్ కొనసాగించకుండానే డ్రాప్ చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img