HomeSocial Mediaదోనూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం

దోనూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కొరకై ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దోనూరు నందు ఈ బడిబాట కార్యక్రమం ఘనంగా జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కాశెట్టి రమేష్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మారాజు రాజేశ్వరి మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం దోనూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల అభ్యాసన స్థాయి తదితర అంశాలకు సంబంధించి ఒక కరపత్రాన్ని తయారుచేసి వాడవాడలా గ్రామ పెద్దలకు యువతకు మరియు తల్లిదండ్రులకు పంపిణీ చేయడం జరిగింది .ఈ కరపత్రంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు మరియు ఒత్తిడి లేని విద్య, ఎలాంటి ఫీజు లేకుండా గుణాత్మకమైన విద్యను అందిస్తున్నామని తెలియజేశారు. స్థానికంగా ఉన్న ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించి పాఠశాల అభివృద్ధికి సహకరించగలరని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామస్తులు యువత విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img