Homeసైన్స్​ & టెక్నాలజీకోడింగ్‌ రాకుండానే.. పది రోజుల్లో ప్రోగ్రామర్‌ కావొచ్చు

కోడింగ్‌ రాకుండానే.. పది రోజుల్లో ప్రోగ్రామర్‌ కావొచ్చు

సీ, సీ++, జావా, పీహెచ్‌పీ, సీక్వెల్‌, పైథాన్‌.. ప్రోగ్రామర్‌ కావాలంటే ఇందులో ఏదో ఒక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీ నేర్చుకోవటం తప్పనిసరి.

కానీ ఆ లాంగ్వేజీలన్నీ నేర్చుకొనే అవసరం లేకుండానే, కోడింగ్‌ రాయకుండానే.. పది రోజుల్లో ప్రోగ్రామర్‌ కావొచ్చు.

నో-కోడ్‌ టెక్నాలజీ (జీరో కోడ్‌)తో ఇది సాధ్యమంటున్నారు నిపుణులు.

సూపర్‌ 100 పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కోర్సు ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌.

బీఈ, బీటెక్‌ లాంటి సాంకేతిక కోర్సులు చేసేవాళ్లకే పరిమితమైన సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని నాన్‌ టెక్నికల్‌ విద్యార్థులకు అందుబాటులోకి తేవటమే దీని ప్రధాన ఉద్దేశం.

ఈ కోర్సును జీరోకోడ్‌ ఇన్నోవేషన్‌ సంస్థ అందుబాటులోకి తెచ్చింది.

ట్రిపుల్‌ ఐటీ కర్నూలు, కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా సంస్థలు ఈ సూపర్‌100 జీరో కోడ్‌ ఇన్నోవేషన్‌ కోర్సును నిర్వహించనుండగా, ఈ కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.

ఈ -లాంచింగ్‌ ద్వారా నిర్వహించిన ప్రారంభోత్సవంలో ట్రిపుల్‌ ఐటీ బెంగళూరు వ్యవస్థాపక డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శఠగోపన్‌, కర్నూలు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సోమయాజులు తదితరులు పాల్గొన్నారు.

మొబైల్‌ యాప్‌ల రూపకల్పనే ధ్యేయం

కోర్సులో భాగంగా తొలుత 100 మందికి శిక్షణనిచ్చి ఉపాధి కల్పించటంతో పాటు, మరో వంద మందికి ఇంటర్న్‌షిప్‌ అందజేస్తారు.

శిక్షణలో భాగంగా మొబై ల్‌, వెబ్‌, ఎంటర్‌ప్రైజెస్‌ గ్రేడ్‌ అప్లికేషన్లను రూపొందించేలా తర్ఫీదునిస్తారు.

కోర్సు వ్యవధి 10రోజులే కావటం గమనార్హం. ఆసక్తిగలవారు https://www.zeroco.de/super100/ ద్వారా ఈ నెల 23లోగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. వివరాలకోసం 99085 00117, 1800 572 3650 నంబర్లను సంప్రదించాలి.

Recent

- Advertisment -spot_img