ఇదేనిజం, శేరిలింగంపల్లి: చందానగర్ లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ముఠా గుట్టును యస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. సీఐ పాలవెల్లి తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ MIG ఇంటి నెంబర్ 1546 లో గుట్టు చప్పుడు కాకుండా వ్యబిచారం నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో యస్ ఓ టి పోలీసులు ఆ గృహం పై దాడి చేయగా నలుగురు యువతులు, ఇద్దరు విటుల అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార నిర్వాహకుడు రాజు పరారీలో ఉన్నాడు. వ్యభిచార గృహంలో పనిచేస్తున్న లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.