Homeతెలంగాణmla rajaiah: బీఆర్ఎస్​ ఎమ్మెల్యేకు నిరసన సెగ

mla rajaiah: బీఆర్ఎస్​ ఎమ్మెల్యేకు నిరసన సెగ

– గో బ్యాక్​ అంటూ నినాదాలు

mla rajaiah: బీఆర్ఎస్​ ఎమ్మెల్యే రాజయ్యకు నిరసన సెగ ఎదురైంది. తీజ్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన రాజయ్యకు చేదు అనుభవం ఎదురైంది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేలకు అక్కడక్కడా నిరసన సెగ తగులుతోంది. తాజాగా ఎమ్మెల్యే రాజయ్య.. హనుమకొండ జిల్లా వేలేరు మండలం చింతల తండా గ్రామంలో తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు.

అక్కడ గ్రామస్తులు, యువత ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గో బ్యాక్ రాజయ్య అంటూ నినాదాలు చేస్తూ పోలీసు వాహనానికి అడ్డంగా నిలబడి గ్రామానికి రానివ్వకుండా చేశారు. అయితే కడియం శ్రీహరి వర్గీయులే ఎమ్మెల్యేను అడ్డుకున్నట్టు సమాచారం.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img