Homeహైదరాబాద్latest Newsగల్ఫ్ కార్మికులకు రైతుభీమా కల్పించండి: మాజీ ఎంపీటీసీ గోవిందుల లావణ్య-జలపతి

గల్ఫ్ కార్మికులకు రైతుభీమా కల్పించండి: మాజీ ఎంపీటీసీ గోవిందుల లావణ్య-జలపతి

ఇదే నిజం, గొల్లపల్లి : బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన రైతులకు రైతు భీమా కల్పించాలి వారి కుటుంబ సభ్యుల ద్వారా వారి భీమా దరఖాస్తులు స్వీకరించాలి. గల్ఫ్ వెళ్లిన కార్మికులవి అక్కడ భద్రతలేని బతుకులు, వారి ఉద్యోగాలకు భద్రత లేదు వారు ఎప్పుడు స్వదేశానికి తిరిగి వస్తారో వారికే తెలియదు. ఇక్కడ బతుకుదెరువు లేక బయట దేశం బతక పోయిన రైతు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆరై తుకు జరగకూడనిది ఏదైనా జరిగితే రైతు భీమా లేక ఆ రైతు కుటుంబం చాలా నష్టపోతుంది. గతంలో గల్ఫ్ వెళ్లారని కార్మిలవి రేషన్ కార్డు నుండి పేర్లు తొలగిస్తే, ఏండ్లు గడిచిన వారి పేర్లు రేషన్ కార్డులో పేరు నమోదు కాక స్వదేశానికి తిరిగి వచ్చిన కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కావున గల్ఫ్ కార్మికుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని గల్ఫ్ వెళ్లిన రైతులకు రైతు భీమా సౌకర్యం కల్పించాలని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల ఏవో కరుణాకి వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గోవిందుల లావణ్య-జలపతి, గుడ్ల విజయభాస్కర్, చిత్తారి లచ్చన్న తొట్ల లక్ష్మీరాజం, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img