Homeజాతీయం#ProvidentFund #PF #Aadhar : ఆధార్‌తో పీఎఫ్‌ను లింక్‌ చేశారా? లేక‌పోతే చెల్లింపుల నిలిపివేత‌!

#ProvidentFund #PF #Aadhar : ఆధార్‌తో పీఎఫ్‌ను లింక్‌ చేశారా? లేక‌పోతే చెల్లింపుల నిలిపివేత‌!

ఉద్యోగులు తమ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) ఖాతాను వచ్చే నెల 1లోపు ఆధార్‌ కార్డుతో అనుసంధానించాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) వెల్లడించింది.

ఆధార్‌తో అనుసంధానం చెందని పీఎఫ్‌ ఖాతాల్లో సెప్టెంబర్‌ 1 నుంచి అన్ని చెల్లింపులను నిలిపివేస్తామని ప్రకటించింది.

ఈ మేరకు కోడ్‌ ఆఫ్‌ సోషల్‌ సెక్యూరిటీ 2020 సెక్షన్‌ 142 నిబంధనను ఉటంకించింది.

ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల సమాచారం వాళ్లు పనిచేసే సంస్థల దగ్గర ఉండటం వల్ల.. యాజమాన్యమే ఉద్యోగి ఆధార్‌ను పీఎఫ్‌ ఖాతాతో అనుసంధానించాలని ఈపీఎఫ్‌వో ఒక నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు ఎల్‌ అండ్‌ ఎల్‌ పార్టనర్స్‌ డైరెక్టర్‌ అమృత టోంక్‌ అన్నారు.

కాగా, పీఎఫ్‌ ఖాతాతో ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన ఈపీఎఫ్‌వో.. తొలుత జూన్‌ 1ని తుది గడువుగా పేర్కొంది. తాజాగా ఆ తేదీని సెప్టెంబర్‌ 1కి పొడిగించింది.

Recent

- Advertisment -spot_img