Homeజిల్లా వార్తలుపేదల కోసమే ప్రజాపాలన కార్యక్రమం:: కలెక్టర్ భవేష్ మిశ్రా

పేదల కోసమే ప్రజాపాలన కార్యక్రమం:: కలెక్టర్ భవేష్ మిశ్రా

ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలను అందజేస్తాం: ఎమ్మెల్యే గండ్ర

ఇదేనిజం, భూపాలపల్లి: అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం ఘనపూర్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు. గ్రామ సభలో ముందస్తుగా ప్రజాపాలన కార్యక్రమం ఉద్దేశం వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పంపిన సందేశాన్ని అధికారులు చదివి వినిపించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ.. డిసెంబర్ 24న ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని కలెక్టర్ తెలిపారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. పేదల జీవితం సంతోషంగా ఉండేందుకే 6 గ్యారెంటీలను ప్రవేశపెట్టామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డి.ఎస్.పి. రాములు, ఎంపీపీ రజిత , ఎంపీపీ ఉపాధ్యక్షులు అశోక్, ఎంపిటిసి లావణ్య , సర్పంచ్ ఆగమ్మ , మండల ప్రత్యేక అధికారులు పురుషోత్తం , ఆశలత, తాసిల్దార్లు ఎంపీడీవోలు సంబంధించిన అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img