Homeహైదరాబాద్latest Newsగ్రామాల్లో ప్రజా పాలన అస్తవ్యస్థం.. పాలకులు లేక స్థంభించిన పాలన

గ్రామాల్లో ప్రజా పాలన అస్తవ్యస్థం.. పాలకులు లేక స్థంభించిన పాలన

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: పంచాయితీ పాలకవర్గం పదవి కాలం గత 4 నెలల క్రితం ముగియడంతో గ్రామాల్లో పాలన స్థంభించిపోయిందని పల్లె ప్రజలు వాపోతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రధాన సమస్యగా పారిశుధ్య లోపం ప్రతి వార్డుల్లో దర్శనమిస్తున్నాయి. మురికి కాలువల్లో ఎక్కడికక్కడే చెత్త పెరుకుపోవడంతో మురికి నీరు రోడ్డు పై పారుతూ.. దుర్వసన వెదజల్లుతుంది. ఇట్టి చెత్తచెదారంలో కుక్కలు, పందులు చెల్లచెదురు చేయడంతో పాదాచారులు ముక్కు మూసుకొని నడవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో కార్యదర్శులు ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, పాలన అధికారులు నియమించినప్పటికి గ్రామాలకు వచ్చి చూసిన దాఖలాలు లేవు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలోని బండాలింగాపూర్ గ్రామం మేజర్ గ్రామ పంచాయితీ అయినప్పటికీ పలు వీధుల్లో మురికి కాలువల నిర్మాణం జరగకపొగ ఉన్న మురికి కాలువలను శుద్ధి చేయకపోవడంతో సమస్యలు తీవ్రమైయ్యాయి. ఇప్పటికి పంచాయతీ ఎన్నికలు జరిగి ఉంటే గ్రామంలో గల పాలక మండలి నిధులతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలు తీర్చేవారని పేర్కొంటున్నారు. సమ్మస్యలు పరిస్కారం కావాలంటే మరో నాలుగు నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొనడం వల్ల పల్లె ప్రజలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

రానున్న వర్ష కాలంలో సమస్యలు తీవ్ర తరం అయ్యేట్లు ఉన్న ప్రభుత్వం మాత్రం ఎన్నికలు నిర్వహించకపోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా పల్లెల్లో కోతుల బెడదతో పాటు, కుక్కల సంఖ్య పెరగడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ప్రస్తుత ప్రభుత్వం పల్లెల్లో ఉన్న సమస్యలను పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెలువెత్తుత్తున్నాయి. పల్లెల్లో పాలన బేసుగ్గా సాగాలంటే తొందరగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని వాదనలు వినిపిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img