Homeజిల్లా వార్తలుప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలి

ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలి

ఇదేనిజం, డోర్నకల్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న అభయహస్తం గ్యారంటీలను సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు షేక్ అఫ్రీద్ అన్నారు. మండలంలోని పెరుమాండ్ల సంకీస గ్రామంలో ఆయన మాట్లాడారు. అభయహస్తం గ్యారంటీలకు పంచాయతీ కార్యాలయంలో అధికారులు నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. యువత ముందు ఉండి అభయహస్తం గ్యారంటీల పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదలకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలను న్యాయం జరుగుతుందన్నారు. పైరవీలు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img