తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజా తిరుగుబాటు మొదలైందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆ తిరుగుబాటును సీఎం రేవంత్ ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరిస్తున్నట్లు ఆరోపించారు. లగచర్లలో పట్నం నరేందర్ రెడ్డి రైతులకు మద్దతిస్తే, కక్షపూరితంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల భూములు లాక్కోవడమేనా అని ప్రశ్నించారు. కాగా గురువారం పట్నం నరేందర్ రెడ్డిని హరీశ్ రావు చర్లపల్లి జైలులో పరామర్శించారు.