HomeజాతీయంInternational driving licence : అంతర్జాతీయ డ్రైవింగ్‌ అనుమతి (ఐడీపీ)పై ప్రజాభిప్రాయం

International driving licence : అంతర్జాతీయ డ్రైవింగ్‌ అనుమతి (ఐడీపీ)పై ప్రజాభిప్రాయం

The Ministry of Road Transport and Highways has issued a draft notification GSR 624 (E) dated 7th October,

2020 seeking comments and suggestions for amendment to Central Motor Vehicles Rules 1989 for facilitating

the issuance of International Driving Permit (IDP) for citizens whose IDP has expired while they are abroad.

భారతీయులు విదేశాల్లో ఉన్న సమయంలో అంతర్జాతీయ డ్రైవింగ్‌ అనుమతి (ఐడీపీ) గడువు ముగిస్తే, ఐడీపీ పునరుద్ధరణకు వీలు కల్పించడానికి,

కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989కు సవరణ కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.

దీనిపై ఈనెల 7వ తేదీన ముసాయిదా ప్రకటన జీఎస్‌ఆర్‌ 624(ఇ)ని కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

భారతీయ పౌరులు విదేశీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా విదేశాల్లో ఉన్నప్పుడు అంతర్జాతీయ డ్రైవింగ్‌ అనుమతి గడువు తీరిపోతే, దానిని పునరుద్ధరించుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు విదేశాల్లో లేవని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

అలాంటి వారికి ఊరటనిస్తూ ప్రస్తుత సవరణ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ సవరణ అమల్లోకి వస్తే, విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల పోర్టళ్ల ద్వారా భారతీయ పౌరులు ఐడీపీ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత ఆర్‌టీవోల పరిశీలన కోసం ఆ దరఖాస్తు ‘వాహన్‌’కు చేరుతుంది.

మన దేశంలో దరఖాస్తు చేసే సమయంలో వైద్య ధృవీకరణ పత్రం, చెల్లుబాటయ్యే వీసా ఉండాలన్న నిబంధనలను కూడా ప్రస్తుత ప్రతిపాదన ద్వారా తొలగించనున్నారు.

చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న పౌరుడు వైద్య ధృవీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదు. ‘వీసా ఆన్‌ అరైవల్‌’ ఇచ్చే దేశాలకు భారతీయులు వెళ్లే సమయంలో, మన దేశంలో సమర్పించడానికి వారి వద్ద వీసా అందుబాటులో ఉండదు.

కాబట్టి, చెల్లుబాటయ్యే వీసా ఉండాలన్న నిబంధన తొలగించనున్నారు.

సలహాలు, సూచనలు పంపాల్సిన చిరునామా: జాయింట్‌ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ అండ్‌ హైవేస్‌, ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌, పార్లమెంట్‌ స్ట్రీట్‌, న్యూదిల్లీ-110001. ఈమెయిల్‌: jspb-morth@gov.in. ప్రకటన విడుదల తేదీ నుంచి 30 రోజుల్లోపు సలహాలు, సూచనలు పంపాలి.

Recent

- Advertisment -spot_img