Homeహైదరాబాద్latest Newsఆ బాలీవుడ్ హీరోని వెనక్కినెట్టి.. నెంబర్. 1 గా ప్రభాస్.. టాలీవుడ్ స్థాయిని మరింత పెంచేశాడుగా..!

ఆ బాలీవుడ్ హీరోని వెనక్కినెట్టి.. నెంబర్. 1 గా ప్రభాస్.. టాలీవుడ్ స్థాయిని మరింత పెంచేశాడుగా..!

మన రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27న విడుదలై సంచలన విజయం సాధించి, రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరేందుకు అతి దగ్గరలో ఉంది. ఈ క్రమంలోనే హిందీ మార్కెట్ పై తన పంజా విసిరాడు మన ప్రభాస్. దాంతో హృతిక్ రోషన్ ను వెనక్కినెట్టి మరీ నెం. 1 హీరోగా అవతరించాడు మన రెబెల్ స్టార్.

ఈ ఏడాది హిందీ అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన మూవీగా హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ చిత్రం నిలిచింది. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీ రూ. 215 కోట్ల నెట్ వసూళ్లను లైఫ్ టైమ్ లో అందుకుంది. అయితే ఈ రికార్డును రెండు వారాలు పూర్తికాకముందే కల్కి చిత్రం ద్వారా ప్రభాస్ బ్రేక్ చేశాడు. ఇప్పటికే బాలీవుడ్ లో కల్కి రూ. 219 కోట్ల వసూళ్లను సాధించి.. స్టడీగా దూసుకెళ్తోంది.

కాగా.. ఈ ఏడాది బాలీవుడ్ గడ్డపై ప్రస్తుతానికి అత్యధిక నెట్ వసూళ్లను సాధించిన మూవీగా కల్కి నిలిచింది. హిందీ మూవీ వెనక్కినెట్టి మన తెలుగు మూవీ నెం.1గా నిలిచింది. దాంతో నిన్న మెున్నటి వరకు టాలీవుడ్ అంటే చిన్న చూపు చూసిన బాలీవుడ్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు డార్లింగ్. వారి గడ్డపైనే కలెక్షన్ల వర్షం కురిపించి.. తెలుగోడి సత్తా ఏంటో చూపించాడు.

Recent

- Advertisment -spot_img