ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ డిసెంబర్ 05న విడుదలై బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమా ఇప్పటికే పలువురు స్టార్ హీరోల రికార్డులను బద్దలు కొట్టింది. తెలుగులోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమా హిందీ వెర్షన్‌లో రూ.618 కోట్లు వసూలు చేసింది. దీంతో బాలీవుడ్‌లో 2వ అత్యధిక వసూళ్లు సాధించింది. తమిళనాడులో ఈ సినిమా రూ.60 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఈ సినిమా విడుదలైన 14 రోజుల్లో రూ.1508 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్లను ప్రకటిస్తూ చిత్రబృందం స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.