Homeసినిమాఆగస్టు 15న Pushpa-2 Release

ఆగస్టు 15న Pushpa-2 Release

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా కాలర్ ఎగరేసిన దర్శకుడు సుకుమార్. పుష్ప ది రైజ్ సినిమాకు గాను అల్లు అర్జున్ ను ఏకంగా నేషనల్ అవార్డు వరించింది. అల్లు అర్జున్ కు స్టైలిష్ స్టార్ ట్యాగ్ ను తీసుకొచ్చిన సుకుమార్, పుష్ప ద్వారా ఐకాన్ స్టార్ గా రీ-ఇంట్రడ్యూస్ చేశాడు. ఈరోజు సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా, పుష్ప యూనిట్ మొత్తం తమ డైరెక్టర్ కి బర్త్ డే విషెస్ ని తెలిపాయి. ఇందులో భాగంగానే, పుష్ప 2 రిలీజ్ డేట్ ను ప్రస్తావిస్తూ, మైత్రి మూవీ మేకర్స్ ఒక ఆసక్తికర పోస్ట్ చేసింది. ‘పుష్ప-2’ 2024 ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా సుకుమార్‌ ఫొటోను స్పెషల్‌గా క్రియేట్ చేసి మరీ షేర్ చేశారు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ న్యూస్ విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.. మొదటి పార్ట్ కంటే సీక్వెల్ గా వస్తున్న సినిమా ఊరమాస్ గా ఉండబోతుందని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రష్మిక మందాన, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నఈ సినిమాలో అనసూయ, సునీల్, రావు రమేష్ లు వివిధ రోల్స్ లో నటిస్తున్నారు. పుష్ప సిరీస్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు

Recent

- Advertisment -spot_img