పుష్ప సినిమా విలన్ ఫహాద్ ఫాజిల్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ (ADHD)తో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఈ వ్యాధి వల్ల ఏకాగ్రత లోపిస్తుందని, ధ్యాస ఉండదని అన్నాడు. హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయని చెప్పుకొచ్చాడు. చిన్నప్పుడే ఈ వ్యాధిని గుర్తిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. కేరళలోని ఓ చిల్డ్రన్ రీహాబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాధి నుంచి ఫహాద్ త్వరగా కోలుకోవాలని అయన అభిమానులు కోరుకుంటున్నారు. పుష్ప 2 లోనూ ఫహాద్ నటిస్తున్నారు.