Homeహైదరాబాద్latest Newsపుష్ప రాజ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా.. 'పుష్ప 2' క్రేజీ అప్ డేట్ రానుంది..!

పుష్ప రాజ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా.. ‘పుష్ప 2’ క్రేజీ అప్ డేట్ రానుంది..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప2’ . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను రిలీజ్ చేయాలనీ మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే..ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు ఓ అప్డేట్‌ రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

Recent

- Advertisment -spot_img