Homeహైదరాబాద్latest NewsPushpa2 The Rule: "పుష్ప 2" లో ఆ యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ గా నిలవనుందట..!

Pushpa2 The Rule: “పుష్ప 2” లో ఆ యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ గా నిలవనుందట..!

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”(Pushpa2 The Rule). ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ వైడ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీ నుంచి తాజా సెకండ్ సింగిల్ విడుదలైంది. స్వామి’ అంటూ సాగె ఈ పాట ప్రేక్షకులకు ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. అలాగే ‘పుష్ప రాజ్’ గా బన్నీవి ఇప్పటికే మూడు స్టిల్స్ విడుదల చేసారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే పుష్ప 2 ఇంటర్వెల్ గురించి… సుకుమార్ ఈ ఇంటర్వెల్ సీన్స్ ను భారీ యాక్షన్ సీక్వెన్స్ గా ప్లాన్ చేశారట. ఆ ఫైట్‌లో అల్లు అర్జున్ వేట పై పడి విరుచుకుతినే సింహంలా కనిపిస్తారట. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent

- Advertisment -spot_img