ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.294 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 829 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ఊర మాస్ కలెక్షన్స్ చూస్తుంటే ఈ సినిమా ఒక వారం లోపే అత్యంత వేగంగా 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టిస్తుంది అని టాక్ నడుస్తుంది.