Homeజిల్లా వార్తలుపుస్తేలతాడు దొంగలు అరెస్టు

పుస్తేలతాడు దొంగలు అరెస్టు

ఇదే నిజం దేవరకొండ: చింతపల్లి మండలం లో 26-06-2024 నాడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కుర్మేడు గ్రామానికి చెందిన గోరేటి బక్కమ్మ భర్త నరసింహ, వయసు 60 సంవత్సరాలు తన ఊరి శివారులో వున్న కంచెరకాలనీ వద్ద గల తన వ్యవసాయ పొలంలో నాటిన ప్రత్తి గింజలు మొలకెత్తినవా? లేదా? అని చూసి రావడం కొరకు వెళ్లి, తిరిగి తన ఇంటికి రావడం కొరకు హైవే ఎక్కి ఇంటికి వస్తుండగా, అదే సమయంలో ఇద్దరు మగ వ్యక్తులు ఒక బైకు పైన ఆమె వద్దకు వచ్చి, ‘ఇది ఏ ఊరు పెద్దమ్మ”? అని అడుగుతూ ఆమె మెడలో ఉన్న సుమారు 4 తులాల బరువు గల బంగారు పుస్తెల త్రాడును లాక్కొని బైకు పైన పారిపోగా, చింతపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, దేవరకొండ డిఎస్పి జి. గిరిబాబు ప్రత్యేక పర్యవేక్షణలో ఎస్సై చింతపల్లి మరియు సిబ్బంది బృందాలుగా ఏర్పడి, సిసి కెమెరాల ఫుటేజ్ లను పరిశీలిస్తూ మరియు వాహన తనిఖీని నిర్వహిస్తూ ఈరోజు అనగా తేదీ 07-07-2024 రోజున చింతపల్లి గ్రామంలోని సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న హైవే పైన ఈ నేరంలో పాలుపంచుకున్న ఇద్దరు నేరస్తులను పట్టుకోవడం జరిగినది. వారి పేర్లు 1) కుర్రా తుల్చా నాయక్ తండ్రి బాలు @ హనుమంతు, వయస్సు 24 సంవత్సరాలు, కులం:- ఎస్‌టి/లంబాడా, వృత్తి: కార్ డ్రైవర్, నా యొక్క స్వస్థలం బాలేంపల్లి గ్రామం, అడవిదేవులపల్లి మండలం, నల్లగొండ జిల్లా మరియు ప్రస్తుత నివాసం: మునగనూరు, హయత్ నగర్, హైదరాబాద్ మరియు 2) ధరావత్ బాలకృష్ణ @ సిద్దూ తండ్రి వీరన్న నాయక్, వయసు 22, కులము: ఎస్‌టి/లంబాడా, వృత్తి: ప్రైవేట్ జాబ్, నివాసం: బాలాజీనగర్, కోదాడ, సూర్యాపేట జిల్లా. వీరి వద్ద నుండి 39 గ్రాముల (3.9 తులాల)బరువు ఉన్న బంగారు పుస్తెల త్రాడు, హోండా షైన్ మోటార్ సైకిల్ నెం. TS05EU0228, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగినది. ఈ హోండా షైన్ మోటార్ సైకిల్ నెం. TS05EU0228 ను నిడమానూరు గ్రామంలో రైస్ మిల్ ఎదురుగా రోడ్డు వెంట పార్కు చేసి ఉండగా తేదీ: 18-06-2024 రోజున వీరు దొంగతనం చేసినారు. మరొక నిందితుడైన రమావత్ వంశీ నాయక్, నివాసం: బాలేంపల్లి గ్రామం, అడవిదేవులపల్లి మండలం, నల్లగొండ జిల్లా పరారీలో ఉన్నాడు. ఇట్టి కేసు చేదనలో భాగమైన సీఐ నాంపల్లి, ఎస్సై చింతపల్లి, సిబ్బంది అయినా సైదులు, కిరణ్, శివకుమార్, రాంబాబు లను నల్లగొండ జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.

Recent

- Advertisment -spot_img