– యువకుడి దారుణ హత్య!
ఇదేనిజం, మల్కాజగిరి : మల్కాజగిరిలోని జవహర్ నగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం యువకుడు దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ వాసులు రవి(16), సచిన్ (19), మరో యువకుడు పెయింటింగ్ పని నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి దమ్మాయిగూడలో ఉంటున్నారు. ముగ్గురు స్నేహితులు ఒకే రూమ్ లో ఉంటూ మద్యం తాగుతున్న సమయంలో గొడవ మొదలైంది. ఈ క్రమంలో మాటమాట పెరగడంతో ఓ యువకుడిపై మిగతా స్నేహితులు దాడి చేశారు. కల్లు తాగిన మైకంలో సచిన్ అనే యువకుడు కూరగాయల కత్తిని తీసుకొచ్చి రవిని పొడిచి చంపేశాడు. ఘటనాస్థలిలోనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.