Homeసినిమానాగ చైతన్యతో రాశి ఖన్నా థాంక్యూ

నాగ చైతన్యతో రాశి ఖన్నా థాంక్యూ

రాశి ఖ‌న్నాకు త‌రువాతి సినిమాకు సంబందించిన ఆస‌క్తిక‌ర స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

థాంక్యూ సినిమాకు సంబందించి కొన్ని నెలల సస్పెన్స్ తరువాత దర్శకుడు విక్రమ్ కుమార్ స‌స్పెన్స్‌కు ముగింపు పలికారు.

నాగ చైతన్య నటిస్తున్న‌ చిత్రం థాంక్యూ లో హీరోయిన్ ఎవ‌ర‌న్న దానిపై కొద్ది రోజులుగా సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తుంది.

దిల్ రాజు బ్యానర్ నిర్మిస్తున్న‌ ఈ రొమాంటిక్ డ్రామా ప‌ని కొంతకాలంగా ముందుకు న‌డుస్తుంది.

అధికారికంగా సంతకం

ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌తో సహా పలువురు హీరోయిన్ల‌ పేర్లు అనుకున్నారు. చివరకు రాశి ఖన్నా ఈ ఆస‌క్తిక‌ర‌ ప్రాజెక్ట్ లో న‌టించే అవ‌కాశాన్ని సొంతం చేసుకున్నాడు.

ఆమెకు ఇది మంచి అవకాశం. రాశి ఖన్నా సినిమాకు సంబందించి అధికారికంగా సంతకం చేసిన‌ట్లు తెలుస్తుంది.

కామెడీ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య, రాశి ఖన్నా ప్రేమికులుగా కనిపించనున్నారు.

రెండోసారి

వీరిద్దరూ క‌లిసి ఇంతకు ముందు దర్శకుడు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ‘వెంకీ మామా’ లో ప్రేమికులుగా నటించారు. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి ప‌లితాలు సాధించింది.

బాలీవుడ్‌లో కూడా

నాగ చైతన్య నెమ్మ‌దిగా త‌న‌ ప్రజాదరణ పెంచుకుంటున్నారు. శేఖర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఆయన రాబోయే చిత్రం ‘లవ్ స్టోరీ’ చాలా సంచలనాలు సృష్టిస్తోంది.

బాలీవుడ్‌లో కూడా అరంగేట్రం చేయనున్నారు నాగ ‌చైత‌న్య‌. అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు.

మరోవైపు, రాశి ఖన్నా గోపిచంద్ యొక్క ‘పక్కా కమర్షియల్’ మరియు కొన్ని తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

మ‌రి కొన్ని వార్త‌లు : More News :

కిక్ బాక్సింగ్ ప్రాక్టీసులో రాశిఖన్నా

రాశీ ఖ‌న్నా గ్లామ‌ర్ షో.. సోష‌ల్ మీడియా షేక్

నాగ చైతన్యతో రాశి ఖన్నా థాంక్యూ

నాకు ఆ ఇమేజ్ మాత్ర‌మే వ‌ద్దు

భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తా..

తమిళ ఇండస్ట్రీపై కన్నేసిన రాశి

చిరకట్టులో ఆకట్టుకుంటున్న రాశీ ఖన్నా

పల్లెటూరి పడుచు పిల్లలా.. హొయలు పోతున్న రాశీ ఖ‌న్నా

సోకులతో చంపేస్తున్న రాశీ ఖన్నా

బ్యాక్​లెస్​ ఫోటోతో రాశి ఖన్నా రచ్చ..

 

Recent

- Advertisment -spot_img