Homeహైదరాబాద్latest Newsరెండు నెలల గడవకముందే రాచకొండ సీపీ బదిలీ.. రీజన్​ ఏంటో

రెండు నెలల గడవకముందే రాచకొండ సీపీ బదిలీ.. రీజన్​ ఏంటో

రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీగా ఐపీఎస్​ అధికారుల బదిలీలు చేపట్టింది. మొత్తం 12 మంది ఐపీఎస్​ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం.. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఐఏఎస్‌ ఇంటి వ్యవహారంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా మురళీధర్‌ను నియమించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ గొట్టే సుధీర్ బాబు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సీపీగా బాధ్యతలు చేపట్టారు. రెండు నెలలు గడవక ముందే బదిలీ కావడం గమనార్హం.

బదిలీ అయిన ఐపీఎస్​ అధికారుల వివరాలు ఇవే..
తరుణ్‌ జోషి – రాచకొండ సీపీ
శ్రీనివాసులు – రామగుండం కమిషనర్‌
జోయల్‌ డేవిస్‌ – సైబరాబాద్‌ ట్రాఫిక్‌ సంయుక్త సీపీగా
నారాయణ నాయక్‌ – సీఐడీ డీఐజీ
అపూర్వరావు – ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీ
ఉదయ్‌ కుమార్‌ – సౌత్‌ వెస్ట్‌ జోన్‌ డీసీపీ
గిరిధర్‌ – ఈస్ట్‌ జోన్‌ డీసీపీ
సాధన రష్మి పెరుమాళ – హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా
సుధీర్‌బాబు – మల్టీజోన్‌-2 ఐజీ
అపూర్వరావు – ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీ
డీ మురళీధర్ – తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌

Recent

- Advertisment -spot_img