Homeహైదరాబాద్latest Newsమంత్రి పొంగులేటి తో కలిసి రఘురాం రెడ్డి పర్యటన

మంత్రి పొంగులేటి తో కలిసి రఘురాం రెడ్డి పర్యటన

ఇదే నిజం, ఖమ్మం రూరల్ : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ముమ్మరంగా పర్యటించారు. పోలిశెట్టి గూడెంలో కోదండ శ్రీ రామాలయం, రాంక్యాతండాలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాణ ప్రతిష్ట వేడుకలకు హాజరై.. ప్రత్యేక పూజలు చేశారు. హరిత గార్డెన్స్ లో కైకొండాయి గూడెంకు చెందిన నాగటి ఉపేందర్ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను దీవించారు. శ్రీ లక్ష్మీ చంద్ర గార్డెన్స్ లో కొత్తకొండ కొండల్ రావు కుమార్తె, లక్ష్మీ గార్డెన్స్ లో గుండా దామోదర్ రెడ్డి కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దానవాయిగూడెంలో చిన్నారి శుభకార్యానికి వెళ్లారు.

Recent

- Advertisment -spot_img