ఇదే నిజం, కుత్బుల్లాపూర్: నిత్యం ప్రజలతో మమేకమై ఉండే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అనంతరం మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతుగా గురువారం 125 – గాజుల రామారం డివిజన్ శ్రీరామ్ నగర్, బేకరీ గడ్డ, ఎన్టీఆర్ నగర్లలో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద స్థానిక కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షులు, నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదవులతో సంబంధం లేకుండా గత 20 ఏళ్లుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, ఎన్నో ఉపాధి కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తే మన బస్తీలు, కాలనీలు రెట్టింపు వేగంతో అభివృద్ధి చెందుతాయన్నారు. పార్లమెంట్లో తెలంగాణ గొంతుకై నిలిచేందుకు బీ ఆర్ ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు విజయ రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్, ఇబ్రహీం, చెట్ల వెంకటేష్, మూసా ఖాన్, దిలీప్, బాబీ చౌదరి, బోయిని మహేష్, వీరన్న, లింగం, కరుణాకర్, మనీ, ఊర్మిళ, రమాదేవి, సాజిదా బేగం, శివ శెట్టి తదితరులు పాల్గొన్నారు.