Homeజాతీయంకేంద్రం తీరుపై మండిప‌డ్డ‌ రాహుల్

కేంద్రం తీరుపై మండిప‌డ్డ‌ రాహుల్

Former Congress president Rahul Gandhi, as usual, has once again lashed out at the Center.

He lamented that the central government had done nothing for the soldiers fighting China to improve the situation on the borders.

To this extent, Rahul Gandhi made a series of tweets on the 2021-22 Union Budget .. Do you know what Modi’s crony centric budget is ..?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పటిలాగానే కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు.

సరిహద్దుల్లో పరిస్థితుల మెరుగుదలకు, చైనాతో పోరాడుతున్న సైనికులకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ మేరకు రాహుల్ గాంధీ 2021-22 కేంద్ర బడ్జెట్‌పై.. మోడీ క్రోనీ సెంట్రిక్ బడ్జెట్ అంటే ఏమిటో తెలుసా.. అంటూ వ్యంగస్త్రాలు సంధిస్తూ వరుస ట్విట్లు చేశారు.

‘‘మోడీ క్రోనీ సెంట్రిక్ బడ్జెట్ అంటే.. తీవ్రమైన పరిస్థితులలో చైనాతో ఎదుర్కొంటున్న జవాన్లకు మద్దతు లభించదు. భారత రక్షకులకు ద్రోహం చేశారు” అని ఆయన ట్వీట్ చేశారు.

‘‘మోడీ క్రోనీ సెంట్రిక్ బడ్జెట్ అంటే.. కష్టపడుతున్న ఎంఎస్ఎంఈలకు (Micro, Small and Medium Enterprises) తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వలేదు. జీఎస్టీ ఉపశమనం లేదు. భారతదేశపు అతిపెద్ద శ్రామిక శక్తికి మోసం చేశారు’’. ఇదే ఫ్రెండ్లీ బడ్జెట్ అంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తూ ట్విట్లు చేశారు.

Recent

- Advertisment -spot_img