HomeరాజకీయాలుRahul Gandhi కాదు ఎన్నికల గాంధీ

Rahul Gandhi కాదు ఎన్నికల గాంధీ

– ఎన్నికలప్పుడే కాంగ్రెస్​ అగ్రనేతలు వస్తారు
– ఎప్పుడూ అందుబాటులో ఉండేది బీఆర్ఎస్​ లీడర్లే
– బోధన్ లో బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత

ఇదేనిజం, బోధన్: బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత .. రాహుల్​ గాంధీపై విమర్శలు గుప్పించారు. రాహుల్​ గాంధీ కాదు ఎన్నికల గాంధీ అంటూ ఫైర్​ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె ఎమ్మెల్యే షకీల్​ కలిసి బోధన్​ లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికలప్పుడే రాష్ట్రానికి వస్తారని ఫైర్​ అయ్యారు. ప్రజలకు ప్రతిక్షణం అందుబాటులో ఉండేది బీఆర్ఎస్​ లీడర్లేనని గుర్తు చేశారు. ప్రధాని మోడీ, కాంగ్రెస్​ నేతలు బీఆర్ఎస్​ పథకాలను కాపీ కొట్టారని విమర్శించారు. రైతు బంధు పథకాన్ని కేసీఆర్​ తీసుకొస్తే.. దాన్ని మోడీ కాపీ కొట్టి.. తక్కువ మొత్తంలో రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్​ ప్రభుత్వం ఇప్పటివరకు ఎకరానికి రూ. 10,000 ఆర్థిక సాయం చేసిందని.. భవిష్యత్​ లో ఈ మొత్తాన్ని రూ. 16,000కు పెంచబోతున్నామని చెప్పారు. తెలంగాణలో మతకల్లోలాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఫైర్​ అయ్యారు. బోధన్​ నియోజకవర్గంలో ఎమ్మెల్యే షకీల్​ బతుకమ్మ పండగకు ఏర్పాట్లు చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మతసామరస్యం వెల్లివిరుస్తోందని గుర్తు చేశారు. వ్యవసాయాన్ని పండగ చేసిన ఘనత కేసీఆర్​ దేనని కొనియాడారు. కాంగ్రెస్ అగ్రనేతలు వచ్చి మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. రైతులకు అన్ని విధాలా మేలు చేస్తున్నామని చివరి గింజ వరకు ధాన్యం కొంటున్నామని గుర్తు చేశారు.

Recent

- Advertisment -spot_img