విజయభేరీ బస్సు యాత్రలో భాగంగా చివరి రోజు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌లో పర్యటిస్తున్నకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. శుక్రవారం ఉదయం జగిత్యాలకు వెళ్తూ మార్గమధ్యలో నూకపల్లి బస్టాండ్ వద్ద వాహనం ఆపారు. రోడ్డు పక్కనున్న ప్రయాణికులను కలిశారు. బైక్పై వెళ్తున్న వారితో ముచ్చటించి చిన్నారులకు చాక్లెట్లు పంచారు. బస్టాండ్ దగ్గరున్న టిఫిన్ బండి వద్దకు వెళ్లి స్వయంగా దోశలు వేశారు.