HomeరాజకీయాలుRahul Gandhi: People are ready to defeat KCR Rahul Gandhi: KCR...

Rahul Gandhi: People are ready to defeat KCR Rahul Gandhi: KCR ను ఓడించేందుకు ప్రజలు రెడీ

– తొమ్మిదేళ్లలో కల్వకుంట్ల ఫ్యామిలీయే బాగుపడింది
– వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు ఖాయం
– బస్సుయాత్రలో రాహుల్​ గాంధీ

ఇదేనిజం, భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాహుల్​ గాంధీ పేర్కొన్నారు. గురువారం భూపాలజిల్లా జిల్లా కాటారంలో నిర్వహించిన బస్సుయాత్రలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని చెప్పిన బీజేపీ ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు కేసీఆర్​ విషయంలో మౌనంగా ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. తెలంగాణలో ఇన్నేళ్లు కుటుంబ పాలన నడిచిందన్నారు. కేసీఆర్‌ ఆయన ఫ్యామిలీ భారీ అవినీతి పాల్పడిందని ఆరోపించారు. వారి అవినీతిని వేరే రాష్ట్రాలకు విస్తరించారని మండిపడ్డారు. ఈ తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం బాగుపడిందే తప్ప తెలంగాణ ప్రజలు బాగుపడలేదన్నార రాహుల్. అందుకే ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు జరుగుతున్నవిగా అభివర్ణించారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఈసారి కచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్​ విషయంలో సైలెంట్​ గా ఉన్న ఈడీ, సీబీఐ తనపై మాత్రం 24 కేసులు పెట్టారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు రాహుల్. ఈ మూడు పార్టీలు కాంగ్రెస్‌ను టార్గెట్ చేశాయన్నారు.

Recent

- Advertisment -spot_img