హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్ నిలయంలో కరోనా వైరస్ కలకలం రేపింది. 30 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చిందని రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. వైరస్ సోకిన వారిలో చాలా మందిలో లక్షణాలు లేనట్టు తెలిపారు. రైల్ నిలయంలో వివిధ విభాగాల్లో పనిచేసే దాదాపు 2500 మంది సిబ్బందికి కొవిడ్ టెస్ట్‌లు చేయగా.. వారిలో 30 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రెండు రోజుల పాటు రైల్ నిలయం మూసివేసి శానిటైజ్ చేయనున్నట్టు రైల్వే సీపీఆర్వో వెల్లడించారు. తిరిగి బుధవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఒక ప్రకటనలో తెలిపారు
రైల్ నిలయంలో 30మందికి సోకిన కరోనా.. రెండు రోజులపాటు మూసివేత
RELATED ARTICLES