Homeఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్​కు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్​కు వర్ష సూచన

– అల్ప పీడన ప్రభావంతో రెండ్రోజుల పాటు వానలు పడే అవకాశం

ఇదే నిజం, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల పాటు వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ పరిసర ప్రాంతాలను అనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా పైనుంచి నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఇది క్రమంగా బలపడి 16వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తర్వాత తీవ్రవాయుగుండంగా మారనుంది. తర్వాత దిశను మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుంది. దీని ప్రభావం వల్ల తమిళనాడులో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తు
న్నాయి. రేపు కోస్తా అంతట వర్షాలు పడే అవకాశం ఉంది. 16, 17 తేదీల్లో ఉత్తర కోస్తా ఒరిస్సాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img